VIEW MORE SONGS

Hrudayamane Kovela Song Lyrics



హృదయమనే కోవెల తలపులు తెరచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
తాను నిలువునా కరుగుతూ కాంతి పంచునది ప్రేమ
గగనానికి నెలకి వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

హృదయమనే కోవెల తలపులు తెరచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ
తన కొరకు ఏ సిరిని అడగదు కదా
నవ్వడమే చూపగల ఈ ప్రేమ
మంటలనే వెన్నెలగా మార్చును కదా

గాలికి గంధము పూయడమే పులకి తెలిసిన ప్రేమసుధా
రాలిన పూవుల జ్ఞ్యాపకామె కాలం చదివే ప్రేమకథ
ప్రియమైన తనవారి సుఖశాంతులనే కోరి మెరిసేటి గుణమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

హృదయమనే కోవెల తలపులు తెరచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఏజాతానో ఎందుకో విడదీసి
వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
మౌనముతో మనసునే శృతిచేసి
రాగాలు పలికించు పాటె ప్రేమ

శాశ్వత చరితాల ఈ ప్రేమ మృత్యువు ఎరుగని చిరునామా
శ్వాసను మంగళహారతిగా వెలిగించేది ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి కరుణించు వరమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

హృదయమనే కోవెల తలపులు తెరచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
Song Name Maa Perati Jamchettu Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Pelli Sandadi Telugu Song Lyrics

Who is the director & music director of the Pelli Sandadi Telugu movie ?

Not Answered

What are the top songs of Pelli Sandadi Telugu movie ?

Not Answered

Which is the most famous song in Pelli Sandadi Telugu movie ?

Not Answered