VIEW MORE SONGS

Ammaye sannaga Song Lyrics



అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

ప్రేమలు పుట్టే వేళ పగళంతా రేయే లే
ప్రేమలు పండే వేళ జగమంత జాతరలే
ప్రేమే తోడుంటే పామైన తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చె పచ్చి మిరపైనా నా నోటికి నారింజే
ఈ వయసులో ఈ వరసలో
ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం
ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే చెయ్యించే తలస్నానమ్
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం
పులకింతలె మొలకెత్తగా
పులకింతలె మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే
Song Name Holi holila Song Lyrics
Singer's Mano,Swarnalatha
Category Tollywood Songs
Movie Name Khushi Telugu Song Lyrics

Who is the director & music director of the Khushi Telugu movie ?

Not Answered

What are the top songs of Khushi Telugu movie ?

Not Answered

Which is the most famous song in Khushi Telugu movie ?

Not Answered