VIEW MORE SONGS

Cheliya Nee Premalone Song Lyrics



చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే
చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే

పెదవి మీద సిగ్గు లన్ని పైట చాటు దాచకే
ముద్దు కోరి చెంతకొస్తే సిగ్గులెందుకే
నీ నవ్వే సింగారమో నీ పలుకే బంగారమే
నీ ముద్దో మందారమో హోం రోజా రా రా రా రా రా

ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే

మాటలన్నీ మాయాచేసి ప్రేమకు వల వేసా
ప్రేమ మైకం పొందిన వేళా మౌనం సాధించా
కన్నులు నాల్గు కలిసినవేలా భాషకు చోటేదీ
మౌనం పాడే ఆలాపనకు మించించినదేముందీ

మాటలే మనసుకి బరువైతే
మౌనమే కానుక అవుతుందీ
మౌనమను భాషే రాకుంటే
ప్రేమ ఇక వ్యర్థం అవుతుందీ

ఈ ప్రేమ భావనే నిజం నిజం
ఎదో చెప్పాలనే ఉందీ గుండె ఝల్లుమంది
సిగ్గుని చెందని పువ్వుని తుమ్మెద అంటాదులే
ముద్దును పొందని సిగ్గుతో బుగ్గలు కందవులే

చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే

ప్రేమ కానుక పొందిన వేళా సర్వం మరిచానూ
నా ప్రేమకు నిత్యం ప్రాణం పోసి కవినై పోయానూ
తియ్యగా పలికిన స్వరమున జల్లున మనసే తడిసింది
నీకై నిలచే నిన్నే తలచి ప్రాణం ఇస్తుంది

యవ్వనము వయసుకు తోడైతే
ఆశలకు పండుగ అవుతుందీ
స్పర్శలో స్వరం కనుగొంటే
జీవితం మధురసమవుతుందీ

ఇక ఊరించేకె ప్రియా ప్రియా
నీ అంద చందాలన్నీ చూసి కళ్ళు చెదిరే
మదిలో దాగిన ఊహలో ఊపిరి నీవైఖరీ
వద్దని కన్నులు మూసినా ఎదుటే నీవుంటివి

చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే
ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే

పెదవి మీద సిగ్గు లన్ని పైట చాటు దాచాకే
ముద్దు కోరి చెంతకొస్తే సిగ్గులెందుకే
నీ నవ్వే సింగారమో నీ పలుకే బంగారమే
నీ ముద్దో మందారమో హోం రోజా రా రా రా రా రా

చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే
Song Name Naa Pedaviki Navvulu Song Lyrics
Singer's Rajesh,Sujatha
Category Tollywood Songs
Movie Name Snehamante Idera Telugu Song Lyrics

Who is the director & music director of the Snehamante Idera Telugu movie ?

Not Answered

What are the top songs of Snehamante Idera Telugu movie ?

Not Answered

Which is the most famous song in Snehamante Idera Telugu movie ?

Not Answered