VIEW MORE SONGS

Chowdary Garu Song Lyrics



చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు

డొనేషన్ల యుగంలోనే డబ్బు లేని దళితుల్లో
వందకోకడు చదువుకుంటే ఓర్చుకొని గుణమెందుకు
అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో
వెయ్యినొకడు నౌకారైతే ఏడ్చుకునే బుద్ధేందుకు
పాయసల జీడిపప్పు తినేవాళ్ళకి సామీ
పాయసల జీడిపప్పు తినేవాళ్ళకి
మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడేందుకు

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు

పల్లెటూళ్ళ సర్పెంచుల పట్టణాల చైరుమాన్ల
సగం మీకే ఇస్తామని సంకలెగర వెయ్యమండ్రు
సంకలెగర వెయ్యమండ్రు
శాసన సభ సభ్యుల్లో పార్లిమెంట్ మేమ్బర్లో
ఆరా కోరా సీటులిచ్చి ఐస్ చేసి పోతుండ్రు

పవర్ లేని పదవికుండే రిజర్వేషన్
పవర్ లేని పదవికుండే రిజర్వేషన్
ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు
ఆ ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు

పండుతున్న భూముల్లో 80 శతం మీదే
మిల్లుల్లో మిషనులో మూడొంతులు మీకిందే
మూడొంతులు మీకిందే
రూపాయి కట్టాలని మీ ఇనప పెట్టెలాందే
బంగారం వెండి అంతా మీ మెడకే మీ కాళ్ళకే
మీ మెడకే మీ కాళ్ళకే

80 శాతం మంది ఎండుకొని చస్తుంటే
20 శాతం మీరు దండుకొని బతుకుతుండ్రు
దండుకొని బతుకుతుండ్రు
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తాము
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తాము
మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తారా

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు

మీ అబ్బా పేరేమో సుబ్బారావు గారైతే
మా అయ్యా పేరేమో సుబ్బి గడు అయిపోయే
మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే
మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కతుండే
మీ అమ్మకు జలుబోస్తే అపోలోలో జేరుతుంటే
మా తల్లికి కాన్సర్ ఐతే ఆకూ పసరు మింగుతుండే
మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదామంటే
దేవుళ్లలో ఒకడైనా దళితుడే లేకపాయె

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకాలెందుకు
Song Name Erupu Rangu Yeda Song Lyrics
Singer's K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Osey Ramulamma Telugu Song Lyrics

Who is the director & music director of the Osey Ramulamma Telugu movie ?

Not Answered

What are the top songs of Osey Ramulamma Telugu movie ?

Not Answered

Which is the most famous song in Osey Ramulamma Telugu movie ?

Not Answered