VIEW MORE SONGS

Meghallo Song Lyrics



మేఘాల్లో సన్నాయి రాగం మోగింది
మేళాలు తాళాలు వినరండి
సిరికి శ్రీ హరికి కళ్యాణం కానుంది
శ్రీరస్తు శుభమస్తు అన్నారండి
అచ తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్తారంటూ
మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ
జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండీ

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురునీ
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవట ఓ రమని

ఇంతవరకెన్నో చూసాం అనుకుంటే సరిపోదుగా
ఎంత బరువంటే మోసే దాక తెలియదుగా
ఇంతమందున్నాం లే అనిపించే బింకం చాటుగ
కాస్తైనా కంగారు ఉంటుందిగ
నీకైతే సహజం తీయని బరువై సొగసించే బిడియం
పనులెన్నో పెట్టి మా తలలె వంచిందే ఈ సమయం
మగాళ్ళం ఐనా ఎం చేస్తాం సంతోషంగ మోస్తాం
ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురునీ
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవట ఓ రమని

రామ చిలకలతో చెప్పి రాయించమే పత్రిక
రాజా హంసలతో పంపి ఆహ్వానించాం గ
కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా
ఏ మాత్రం ఏ చోట రాజి పడలేక
చుట్టాలందరికి ఆనందంతో కళ్ళు చెమర్చేలా
గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కనులను వీచేలా
కలలోనైనా కన్నమ కథలైనా విన్నామా
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మ

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురునీ
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవట ఓ రమని
Song Name Inka Cheppale Song Lyrics
Singer's Rahul Nambiar,Swetha Pandit
Category Tollywood Songs
Movie Name Seethamma Vakitlo Sirimalle Chettu Telugu Song Lyrics

Who is the director & music director of the Seethamma Vakitlo Sirimalle Chettu Telugu movie ?

Not Answered

What are the top songs of Seethamma Vakitlo Sirimalle Chettu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Seethamma Vakitlo Sirimalle Chettu Telugu movie ?

Not Answered