VIEW MORE SONGS

Marumalli Jabilli Song Lyrics



మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి

మన్మధుని రాఘవుని కలబోతే బావ అని

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని

ఇద్దరొక్కటయ్యే పెళ్లి ఈడు జోడు పెళ్లి
ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడకా పెళ్లి

బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై జరుగుతున్న పెళ్లి
బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్లి

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
ఇద్దరొక్కటయ్యే పెళ్లి ఈడు జోడు పెళ్లి
ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడకా పెళ్లి

దేవుళ్ళు దేవతలు కొలువై లేరు కోవెలలో
బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో

ఊరు వాడ వేడుక ప్రతి ఒక్కరి హృదయం వేదిక
లేనే లేదు తీరిక ప్రతి నిమిషం తెలియని తికమక

మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో
మా వాల్లై అయినోల్లై ఒక చెయ్యేసినాయి మేళంలో

పందిరిలోన పండుగలన్నీ నిలుపుతున్న పెళ్లి
నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్లి

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
ఇద్దరొక్కటయ్యే పెళ్లి ఈడు జోడు పెళ్లి
ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడకా పెళ్లి

మా నాన్న మా అన్న ఇద్దరు నాకు పుట్టిల్లు
అందరికి సెలవంటూ నేవెళ్ళి వొస్తా అత్తిల్లు

చల్లని చూపే కాటుక ఇక చెరగని ప్రేమే బొట్టుగా
మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా

ఆత్రాన్నై సూత్రాన్నై ముద్దుగా వేస్తా బంధాలు
నేస్తన్నయ్ నీ వాడనై నీ వద్ద ఉంటా వందేళ్లు

మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటైన పెళ్లి
కలిసిన మనసే సాక్షిగా నిలిచే స్వచ్ఛమైన పెళ్లి

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడక పెళ్లి
ఇద్దరొక్కటయ్యే పెళ్లి ఈడు జోడు పెళ్లి
ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడక పెళ్లి
Song Name Andam Lo Andhra Kostha Song Lyrics
Singer's S.P.Balasubramanyam,Shreya Ghoshal
Category Tollywood Songs
Movie Name Laxmi Narasimha Telugu Song Lyrics

Who is the director & music director of the Laxmi Narasimha Telugu movie ?

Not Answered

What are the top songs of Laxmi Narasimha Telugu movie ?

Not Answered

Which is the most famous song in Laxmi Narasimha Telugu movie ?

Not Answered