VIEW MORE SONGS

Kastha nannu Song Lyrics



కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే
తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే
తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే
కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే
పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే
మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే
చిన్ననాడె అన్న ప్రాసనయ్యిందోయ్
కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్
అమ్మచేతి గోరు ముద్దతిన్నానోయ్
అందగాడి గోటి ముద్ర కావాలోయ్
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే
కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే
చేరుకున్నచోట ఉన్నదీపమారుతుంటే
ఆరుతున్నవేళ కన్నె కాలు జారుతుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే
గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే
కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే
పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే
బుగ్గలోన పండుతుంది జాంపండు
పక్కలోన రాలుతుంది ప్రేంపండు
రాతిరేళ వచ్చిపోరా రాంపండు
బంతులాడి పుచ్చుకోరా భాంపండు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే
ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే
చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే
రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
Song Name Paddanandi Song Lyrics
Singer's Udit Narayan,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Student No 1 Telugu Song Lyrics

Who is the director & music director of the Student No 1 Telugu movie ?

Not Answered

What are the top songs of Student No 1 Telugu movie ?

Not Answered

Which is the most famous song in Student No 1 Telugu movie ?

Not Answered