VIEW MORE SONGS

Swarala Veena Song Lyrics



స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమయిదే ఆకాశమా
స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమయిదే ఆకాశమా

ఎండలో ఇలా పూల వానలా
మెరుపు కూడ మల్లెతీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా

నువ్వు తప్ప కళ్ళముందు
లేరు ఎవరు నమ్మవా

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమయిందే ఆకాశమా

రేయి చీర కప్పుకున్న చందమామని
నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్లనీ

తారలన్ని అల్లుకున్న మేఘమాలనీ
వాలు కళ్ళ సాగరాన కాటుకల్లె మారని

వాలే పొద్దులా జారే నీ జడా
నడుముపై నాట్యమే ఆడితే
విరిసే పువ్వులా కురిసే మంచులా
నువ్వలా చల్లగా నవ్వితే

నేను చూడలేను చూసాక ఆగలేను
ఎన్నాళ్ళు నిన్ను వదిలి ఉండనూ

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమయిందే ఆకాశమా

మూసివున్న రెప్పలల్లో కలల వనంలా
నిదుర రాణి వేళలోన కలవరింతలా ఇలా

ఊపిరంత ఊహలతో నిండిపోయినా
గుండెలోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా

నేనే నేనుగా లేనే లేనుగా
నాకే వింతగా ఉందిగా
నీలా ఎవ్వరు నన్నే ఎప్పుడు
కమ్ముకో లేదులే ఇంతలా

రేయి నిదుర రాదు పగలంత కునుకులేదు
అసలేమయిందో నాకె తెలియదూ

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమయిందే ఆకాశమా

ఎండలో ఇలా పూల వానలా
మెరుపు కూడ మల్లెతీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా

నువ్వు తప్ప కళ్ళముందు
లేరు ఎవరు నమ్మవా

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమయిందే ఆకాశమా
Song Name Swarala Veena Song Lyrics
Singer's Chakri
Category Tollywood Songs
Movie Name Oka Raju Oka Rani Telugu Song Lyrics

Who is the director & music director of the Oka Raju Oka Rani Telugu movie ?

Not Answered

What are the top songs of Oka Raju Oka Rani Telugu movie ?

Not Answered

Which is the most famous song in Oka Raju Oka Rani Telugu movie ?

Not Answered