VIEW MORE SONGS

Jada Song Lyrics



ఏ అబ్బబ్బా అది ఏం పోరి
చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో
దాని జడపై మనసు పడి

మెడకి నడుముకి నడుమ
నాగుపాములాగా కదలాడి
ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి

చార్మినారు లాంటి లైఫునే
ప్యార్మినారు లాగ మార్చెనే
దిల్లునే దీవాను జేసి దీపం పెట్టిందే

ఓ ఓ గోల్కొండ కోట లాంటి నన్నే
రాణి వాసమల్లె మార్చుకుంటూ
రంగులే పూసేసినాదే కళ్ళనే కుంచె చేసి

చోరు బజారుకే నేను జమిందారు
నన్ను దోచే వారే ఎవరు లేనే లేరు
అనుకునే లోగ నన్ను చేసేసావే చోరీ

ఓయ్ ఓయ్ ఓయ్ పాత బస్తీకి నేను పహిల్వాన్
ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను
జడ గంటలతో పడేసావే పోరి ఓ ఓ ఓ

సిన్నబోయి కూసున్న ప్రేమ జంట
సాయంకాలవేళ మరుగు మీద అలిగి
పొద్దుగాల ప్రేమలోన పడిపోయే
జంట కోయిలలే జంట కోయిలలే

కుదురుగుండదే మనసంతా
కునుకే పట్టదే రేయంతా
తనే లోకమై రోజంతా తిరిగేస్తూనే ఉంటా

ఎవరు ఏమన్నా వినపడదే
ఎదురు ఎమున్నా కనపడదే
పిల్ల ప్రేమలో పడ్డాక నను నేనే విడిపోయా

ఓ ఓ పోలీసుల వేట డైలీ దొంగాట
మరిచే పోయానే ఈ పిల్ల బాట బట్టినాక
సమస్య లేకుండా సరెండరై పోయా
నేరమేమి జెయ్యకుండానే ప్రేమ ఖైదీనైపోయా

చోరు బజారుకే నేను జమిందారు
నన్ను దోచేవారే ఎవరు లేనే లేరు
అనుకునే లోగ నన్ను చేసేసావే చోరీ

ఓయ్ ఓయ్ ఓయ్ పాత బస్తీకి నేను పహిల్వాన్
ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను
జడ గంటలతో పడేసావే పోరి ఓ ఓ ఓ

అబ్బబ్బా ఇది ఏం పోరి
చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో
దాని జడపై మనసు పడి

మెడకి నడుమకి నడుమ
నాగుపాములాగా కదలాడి
ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి




Song Name Bachchan Saab Fan Anthem Song Lyrics
Singer's Mangli(Sathyavathi)
Category Tollywood Songs
Movie Name Chor Bazaar Telugu Song Lyrics

Who is the director & music director of the Chor Bazaar Telugu movie ?

Not Answered

What are the top songs of Chor Bazaar Telugu movie ?

Not Answered

Which is the most famous song in Chor Bazaar Telugu movie ?

Not Answered