VIEW MORE SONGS

Merisele Merisele Song Lyrics



మాంగళ్యం తంతునానే మమజీవన హేతునా

అరె మెరిసెలే మెరిసెలే మిలమిల మిల మెరిసెలే
కనులలో వెలుగులే కలల సిరులుగా
జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే
అడుగులే ఒకటిగా కలిసి నడవగా
ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా
తొలి వలపే వధువై నిలిచే ఏ ఏఏ వరుడే వరమై రాగ
ఈ జగమే అతిథై మురిసే ఏ ఏఏ మనసే మనువై పోగా
ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

ఒక కలలాగ కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం
ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగేను బాణం
ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం
ఒక స్వరమై తడిమినది తనువును రాగ బంధం
గుండె నిండా సందడేదో తెచ్చి ఉండిపోయినావే పండగల్లె వచ్చి
పున్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి
జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు జడిగా
ఎదపై పలికే తడి తకతకతక తరికిటధిమిత
ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

గెలిచినవే నిను నా ప్రేమ నిలిపినదె లోనా
విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ రానా
ఒక నీడనై నడిపించనా ఒక ప్రాణమై బ్రతికేయనా
ప్రణయములే ఎదురైనా చెదరనిదీ ప్రయాణం
చరితలలో చదవని ఓ కధ మన ప్రేమ కావ్యం
నువ్వు నేను పాడుకున్న పాట రంగురంగులున్న జ్ఞాపకాల తోట
నువ్వు నేను ఏకమైనా చోట మబ్బులంటూ లేని చందమామ కోట
నువ్వు నా సగమై జగమై ఉదయపు తొలి కిరణములా
వెలుగై తగిలే నులి జిలిబిలి తళుకుల తరగలుగా

ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా
ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా
తొలి వలపే వధువై నిలిచే ఏ ఏఏ వరుడే వరమై రాగ
ఈ జగమే అతిథై మురిసే ఏ ఏఏ మనసే మనువై పోగా
ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా
Song Name Ye Kannulu Choodani Song Lyrics
Singer's Sid Sriram
Category Tollywood Songs
Movie Name Ardhashathabdham Song Lyrics

Who is the director & music director of the Ardhashathabdham movie ?

Not Answered

What are the top songs of Ardhashathabdham movie ?

Not Answered

Which is the most famous song in Ardhashathabdham movie ?

Not Answered