VIEW MORE SONGS

Konthakalam kindhata Song Lyrics



కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

బొమ్మ బొరుసులేని నాణేనికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్థం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదలై సాగాలి ఈ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి
Song Name Veyi Song Lyrics
Singer's R.P Patnaik,Usha
Category Tollywood Songs
Movie Name Nee Sneham Telugu Song Lyrics

Who is the director & music director of the Nee Sneham Telugu movie ?

Not Answered

What are the top songs of Nee Sneham Telugu movie ?

Not Answered

Which is the most famous song in Nee Sneham Telugu movie ?

Not Answered