VIEW MORE SONGS

Yenaatiki manamokatenani Song Lyrics



ఏనాటికి మనమొకటేనని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని

కన్నీరు జోరయ్యింది
ఆ నీరు ఏరయ్యింది
నువ్ లేక సంతోషమా
వాకిట్లొ వసంతాలు
ఆనాటి సాయంత్రాలు
నువ్వు లేక శూన్యం సుమా

నాతోనే నువ్వు ఉంటావని
ఆ రోజే నువ్వు అన్నావని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా

ఏనాటికి మానమొకటేనని
ఏచీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని

నీ కోసమే మిగిలున్నానిలా
నువ్ రాక నేనింక ఎన్నాళ్లిలా
నా గుండెలో నీ ఆలోచన
నా కంటిపాపల్లో ఆవేదన

ఇది మౌనరాగల సంకీర్తన
ఇలా చూడు ఏవైపు అడుగేసిన

నీలోనే సగమున్నానని
నీకోసం మిగిలున్నానని
ఎలా నీకు తెలిపేది ఓ నేస్తమా

ఏనాటికి మానమొకటేనని
ఏచీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని

మరుపన్నది ఇటు రాదే ఎలా
నా మనసుకేమయింది లోలోపల
వలపన్నది చెలరేగే అలా
ఎదలోన దాగుంది పోదే ఎలా

జడివానలా వచ్చి తడిపేయవ
ప్రియా అంటూ ప్రేమార పిలిచేయవ

నీవైపే ఎద లాగిందని
నీ చూపే అది కోరిందని
చెలి నీకు తెలిసాక చెలగాటమా

ఏనాటికి మానమొకటేనని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని

కన్నీరు జోరయ్యింది
ఆ నీరు ఏరయ్యింది
నువ్ లేక సంతోషమా
వాకిట్లో వసంతాలు
ఆనాటి సాయంత్రాలు
నువ్వు లేక శూన్యం సుమా

నాతోనే నువ్వు ఉంటావని
ఆ రోజే నువ్వు అన్నావని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా


Song Name Mona Mona Song Lyrics
Singer's Kousalya,Hariharan
Category Tollywood Songs
Movie Name Shivamani Telugu Song Lyrics

Who is the director & music director of the Shivamani Telugu movie ?

Not Answered

What are the top songs of Shivamani Telugu movie ?

Not Answered

Which is the most famous song in Shivamani Telugu movie ?

Not Answered