Song lyrics for Thodakotti

Thodakotti Song Lyrics in English Font From Okato Number Kurradu Telugu Movie Starring   Rekha Vedavyasa,Taraka Ratna Ramarao in Lead Roles. Cast & Crew for the song " Thodakotti" are Rajesh Krishnan,Udit Narayan , director

Thodakotti Song Lyrics



తొడకొట్టి చెబుతున్నా తొలమాట
జబ్బ చరిచి చెబుతున్నా భలే మాట
రొమ్ము విరిచి చెబుతున్నా కాలు దున్ని చెబుతున్నా
బల్ల గుద్ది చెబుతున్నా బంపరు మాట
ప్రేమన్నది ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్కు
ప్రేమన్నది ప్రతి ఒక్కరు తర్చాల్సిన మొక్కు
ప్రేమన్నది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం

ఆడ రెండక్షరాలు మగ రెండే అక్షరాలు
ఆడ మగ మధ్య పుట్టు ప్రేమే రెండక్షరాలు
తప్పు రెండక్షరాలు ఒప్పు రెండు అక్షరాలు
తప్పొప్పులు చేయించు ప్రేమే రెండక్షరాలు
బాధ రెండక్షరాలు హాయి రెండక్షరాలు
ఈ రెంటిని కలిగించు ప్రేమే రెండక్షరాలు
ప్రేమన్నది ఫలి ఇస్తే పెళ్ళి రెండక్షరాలు
ప్రేమన్నది వికటిస్తే పిచ్చి కూడా రెండక్షరాలే
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం

ప్రేమన్నది ఒక గ్రామం ప్రేమికులకు స్వగ్రామం
ఎదిరించిన వాళ్ళతోటి చేస్తుందోయ సంగ్రామం
ప్రేమన్నది పదో గ్రహం అందించును అనుగ్రహం
అనుగ్రహమే పొందుటకు కావాలోయ నిగ్రహం
ప్రేమన్నది ఒక దారం అన్నిటికది ఆధారం
ప్రేమించిన హృదయాల్లో పూస్తుందోయ మందారం
ప్రేముంటె సౌభాగ్యం లేకుంటే దౌర్భాగ్యం
లవ్వాడుట ఆరోగ్యం ఆడకుంటే అదో అనారోగ్యం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంతం ఇది అక్షర సత్యం
Song Name Thodakotti lyrics
Singer's Rajesh Krishnan,Udit Narayan
Movie Name Okato Number Kurradu Telugu
Cast   Rekha Vedavyasa,Taraka Ratna Ramarao

Which movie the "Thodakotti" song is from?

The song " Thodakotti" is from the movie Okato Number Kurradu Telugu .

Who written the lyrics of "Thodakotti" song?

director written the lyrics of " Thodakotti".

singer of "Thodakotti" song?

Rajesh Krishnan,Udit Narayan has sung the song " Thodakotti"