Song lyrics for Chalirathiri Vastavani

Chalirathiri Vastavani Song Lyrics in English Font From Donga Ramudu and Party Telugu Movie Starring   Laya,Srikanth in Lead Roles. Cast & Crew for the song " Chalirathiri Vastavani" are NA_Add1 , director

Chalirathiri Vastavani Song Lyrics



చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా
బిగి కౌగిలికొస్తావని బిడియాలే దోస్తావని
ఎద వాకిట గిలిగింతగ పూసే నా ఆశా

ప్రాయాలే పంచాలి నులివెచ్చగా
కాలాలే తోచాలీ సరికొత్తగా
గతజన్మల పరిచయమే బతికించెను మన కలలే
పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే

ప్రాణమైన ప్రేమ మన ప్రేమ
హాయి పేరు ప్రేమ మన ప్రేమ

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా

పరువాల తెర తీసే చొరవే దొరికేనా
క్షణమైనా గడిపేస్తే వరమే ఒడిలోనా
హృదయాలే వెలిగించే గుణమే ఈ ప్రేమా
విరహాలే కరిగిస్తే సుఖమే జడివాన

గాలైనా రాకుండా మన దారిలో
హాయేదో పెరిగింది మలిసంధ్యలో
భారాలే తీరంగా మది లోపలా
గానాలే చేసింది ఎద కోయిలా

నలువైపుల రాగాలే మధువొలికే మేఘాలే
వానవిల్లు విరిసే మరి విరిసే
తేనే జల్లు కురిసే మది కురిసే

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా

తనువుల్లో మనస్సుల్లో జ్వరమే ఈ ప్రేమా
చిగురేసీ చైత్రంలా పెరిగే లోలోన
అరుదైన విలువైన చెలిమె ఈ ప్రేమా
తపియించె ఎదలోనా చినుకై కురిసేనా

చుక్కలని దాటించే అలవోకగా
ఎక్కడికో చేర్చేదీ మలపే కదా
మక్కువతో వేధించే ప్రతి జాములో
చెక్కిళ్ళు నిమురేటి చనువే కదా

మునుపెరుగని మురిపాలు ముదిరాయి సరదాలు
పూలజల్లు ప్రేమ మన ప్రేమ
తీపి ముళ్ళు ప్రేమ ఈ ప్రేమ

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా
బిగి కౌగిలికొస్తావని బిడియాలే దోస్తావని
ఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశా
ప్రాయాలే పంచాలీ నులివెచ్చగా
కాలాలే తోచాలీ సరికొత్తగా

గతజన్మల పరిచయమే బతికించెను మన వలనే
పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే
ప్రాణమైన ప్రేమ మన ప్రేమ
హాయి పేరు ప్రేమ మన ప్రేమ

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా

Song Name Chalirathiri Vastavani lyrics
Singer's NA_Add1
Movie Name Donga Ramudu and Party Telugu
Cast   Laya,Srikanth

Which movie the " Chalirathiri Vastavani" song is from?

The song " Chalirathiri Vastavani" is from the movie Donga Ramudu and Party Telugu .

Who written the lyrics of " Chalirathiri Vastavani" song?

director written the lyrics of " Chalirathiri Vastavani".

singer of " Chalirathiri Vastavani" song?

NA_Add1 has sung the song " Chalirathiri Vastavani"