Song lyrics for Dosthulam

Dosthulam Song Lyrics in English Font From Mem Famous Telugu Movie Starring   Mourya Chowdary,Sumanth Prabhas in Lead Roles. Cast & Crew for the song " Dosthulam" are Kaala Bhairava , director

Dosthulam Song Lyrics



అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం

చిన్ననాటి నుండి
జ్ఞానపకాల తోని
కట్టుకున్న వంతెనేమైంది
ఇంతలోనే వాన తాకినట్టు
ఈ కాలం కూల్చెనా

మనకు మనకు మధ్య
దాచుకున్న మాటలంటు
లేనే లేవు ఇంతవరకు
ఇప్పుడెందుకో దాచిపెట్టె
ఈ బాధే లోతునా

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా
బాధలోను ఉంటేనే దోస్తులురా
మాది కాదు బాధనుకుంటే
స్నేహం ఉండదురా

తప్పుల్లోను నీతోనే ఉన్నామురా
గొప్పల్లోను నీతోనే ఉన్నామురా
చెప్పలేని బాధే ఉన్నా
చెయ్యే వదలమురా

నీతో ఉంటూ మాటలు రాని
మౌనం చూడకురా
మౌనం వెనకే మాటలు కలిసిన
భాదుందిరా లోపల

స్నేహంలోన కోపాలన్నీ
కరిగే మేఘాలురా
స్నేహం అంటే ఎపుడు ఉండే
ఆకాశమే కదరా

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

కళ్లలోకి కన్నీరు రాగానే
మాట కొంచం తడబడుతుండగనే
ఏమయ్యింది మామా అంటూ
అడిగె గొంతువిరా

నీతో ఉంటే నవ్వుతు ఉంటరా
నువ్వుంటేనే మనమని అంటమురా
కారణాలు దొరకవు
నువ్వు దూరం పోవాలన్నా

నీకు నాకు మధ్యలో
దూరం రావాలన్నా
వద్దు అంటూ ఆ క్షణాన్ని
ఏడుస్తు ఆపనా

గమ్యం చేరే పయనాన్నీ
స్నేహం ఆపుతుందా
నీ మంచే కోరి పొమ్మనేంత
ప్రేమే మాకు లేదు

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం
Song Name Dosthulam lyrics
Singer's Kaala Bhairava
Movie Name Mem Famous Telugu
Cast   Mourya Chowdary,Sumanth Prabhas

Which movie the "Dosthulam" song is from?

The song " Dosthulam" is from the movie Mem Famous Telugu .

Who written the lyrics of "Dosthulam" song?

director written the lyrics of " Dosthulam".

singer of "Dosthulam" song?

Kaala Bhairava has sung the song " Dosthulam"