Song lyrics for Telugu Bhasha

Telugu Bhasha Song Lyrics in English Font From Neeku Nenu Naaku Nuvvu Telugu Movie Starring   Shriya Saran,Uday Kiran in Lead Roles. Cast & Crew for the song " Telugu Bhasha" are Spb Charan , director

Telugu Bhasha Song Lyrics



తెలుగు భాష తియ్యదనం
తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్ళకి
తెలుగే ఒక మూలధనం

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే
వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా

తెలుగు భాష తియ్యదనం
తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్ళకి
తెలుగే ఒక మూలధనం

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని
నువు మరచినట్టురా
ఇది మరువబోకురా

అమ్మ అన్న పిలుపులోన
అనురాగం ధ్వనిస్తుంది
నాన్న అన్న పదములోన
అభిమానం జనిస్తుంది

మమ్మీ డాడీ లోన
ఆ మాధుర్యం ఎక్కడుంది
మామ అన్న మాట
మనసు లోతుల్లో నిలుస్తుంది
అత్తా అంటే చాలు
మనకు ఆదరణే లభిస్తుంది

ఆంటీ అంకుల్ లోన
ఆ ఆప్యాయత ఎక్కడుంది

పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ ఋణం
తీర్చరా కొంత ఋణం తీర్చరా

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

కొమ్మల్లోన పక్షులన్నీ
తమ కూతను మార్చుకోవు
భూమి పైన ప్రాణులన్నీ
తమ భాషను మరువలేవు

మనుషులమై మన భాషకు
ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేధావులు
మన పలుకులు మెచ్చినారు

పొరుగు రాష్ట్ర కవులు కూడ
తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు
అన్యాయం చేస్తున్నాము

అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది బాషా ఆచారాలను మింగెయ్యొద్దు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గు పాల భాష పలికెందుకు సిగ్గు
పడకురా వెనక్కి తగ్గమాకురా

తెలుగు భాష తియ్యదనం
తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్ళకి
తెలుగే ఒక మూలధనం

మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా
అమ్మ నాన్న అంటు నేటి నుండి
పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా


Song Name Telugu Bhasha lyrics
Singer's Spb Charan
Movie Name Neeku Nenu Naaku Nuvvu Telugu
Cast   Shriya Saran,Uday Kiran

Which movie the "Telugu Bhasha" song is from?

The song " Telugu Bhasha" is from the movie Neeku Nenu Naaku Nuvvu Telugu .

Who written the lyrics of "Telugu Bhasha" song?

director written the lyrics of " Telugu Bhasha".

singer of "Telugu Bhasha" song?

Spb Charan has sung the song " Telugu Bhasha"