Manninchu O Prema Song Lyrics
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా
మన్నించు ఓ ప్రేమ మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
మన్నించు ఓ ప్రేమ మరుగేల చెప్పమ్మా
దరి చేరు దారేధైన చూపించుమా
చెప్పనంటూ దాచడానికైనా
అంత చెప్పరాని మాట కాదు అవునా
ఇంత మంచి వేళ ఎదురైనా
మరి చెప్పుకోవ ఇంక ఇప్పుడైనా
పట్టరాని ఆశ పెంచుకున్న
అది మోయరాని భారమౌతున్న
చెప్పుకుంటే తప్పులేదు అయినా
నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా
మన్నించు ఓ ప్రేమ మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
జంట కమ్మని వెంట రమ్మని
పిలిచే నేస్తమా
కొంత చేరువై కొంత దూరమై
ఉంటే న్యాయమా
రెండు చేతులా అందుకోమని
అనవేం స్నేహమా
చెంత నిలిచినా చేయి కలపవేం
నాదే నేరమా
చొరవగా పొదుముకో నడిపే ప్రణయమా
బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా
తగిన తరుణమని ఉదయ కిరణమై
ఎదురుపడిన వరమా
మన్నించు ఓ ప్రేమ మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
అన్ని వైపులా చెలిమి కాపలా
అల్లే బంధమా
మబ్బులో అలా దాగితే ఎలా
దిగిరా చంద్రమా
నిదురలో అలా నిలిచిపోకల
మెరిసే స్వప్నమా
కంటి పాపలో కబురులేమిటో
చెబితే పాపమా
తలపునే తెలుపవే నాలో ప్రాణమా
పెదవిపై పలకవేం ఊహా గానమా
మదిని మీటినది నీవు కాద మరి
మధురమైన స్వరమా
మన్నించు ఓ ప్రేమ మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
చెప్పనంటూ దాచడానికైనా
అంత చెప్పరాని మాట కాదు అవునా
ఇంత మంచి వేళ ఎదురైనా
మరి చెప్పుకోవ ఇంక ఇప్పుడైనా
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా
Song Name | Manninchu O Prema lyrics |
Singer's | Udit Narayan,K.S. Chitra |
Movie Name | Ela Cheppanu Telugu |
Cast | Shriya Saran,Tarun |
Which movie the "Manninchu O Prema" song is from?
The song " Manninchu O Prema" is from the movie Ela Cheppanu Telugu .
Who written the lyrics of "Manninchu O Prema" song?
director written the lyrics of " Manninchu O Prema".
singer of "Manninchu O Prema" song?
Udit Narayan,K.S. Chitra has sung the song " Manninchu O Prema"