Song lyrics for My Heart is Beating

My Heart is Beating Song Lyrics in English Font From Jalsa Telugu Movie Starring   Ileana D'Cruz,Pawan Kalyan in Lead Roles. Cast & Crew for the song " My Heart is Beating" are Sachin Tyler , director

My Heart is Beating Song Lyrics



మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా
తరుముతోంది మదీ

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ

టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా
తరుముతోంది మదీ

Hey i wanna be with u forever
Hey i wanna live with u forever

పెనుతుఫాను ఏదైనా
మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా
మదిని ముంచి పోయిందా

ఊరికినే పెరగదుగా
ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా
నాలో నిలువెల్లా

తలపులలో చొరబడుతూ
గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ
తెల్లార్లు ఒంటరిగా వేగాలా

సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే
స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే
సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా
తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో
నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో
నీ మీద ఉన్న అభిమానం

త్వరత్వరగా తరిమినదే
పదపదమని పడుచు రథం
ఎదలయలో ముదిరినదే
మదనుడి చిలిపి రిథం

గుసగుసగా పిలిచినదే
మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే
దం అరె దం అని తూలే ఆనందం

ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో
వెల్ కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో
ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా
తరుముతోంది మదీ
Song Name My Heart is Beating lyrics
Singer's Sachin Tyler
Movie Name Jalsa Telugu
Cast   Ileana D'Cruz,Pawan Kalyan

Which movie the "My Heart is Beating" song is from?

The song " My Heart is Beating" is from the movie Jalsa Telugu .

Who written the lyrics of "My Heart is Beating" song?

director written the lyrics of " My Heart is Beating".

singer of "My Heart is Beating" song?

Sachin Tyler has sung the song " My Heart is Beating"