నడిపించు నా నావా song lyrics -Telugu Christian Songs Lyrics

నడిపించు నా నావా jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నడిపించు నా నావా-Telugu Christian Song Lyrics

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప       ||నడిపించు||

నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        ||నడిపించు||

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ          ||నడిపించు||

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు              ||నడిపించు||

ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట       ||నడిపించు||

లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా         ||నడిపించు||

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు     ||నడిపించు||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నడిపించు నా నావా"?

___ written the lyrics of " నడిపించు నా నావా".

SINGER OF "నడిపించు నా నావా" Christian Song or Jesus SONG?

____ has sung the song " నడిపించు నా నావా"